ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదే సాహో దర్శకుడికి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని.. మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ వదులుకోవాల్సి వచ్చిందని.. ఇలా రెండు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో రన్ రాజా రన్ సినిమాతో హిట్ అందుకున్న సుజీత్ ఏకంగా ప్రభాస్ తో పాన్ ఇండియన్ సినిమా చేసే అవకాడం దక్కించుకున్నాడు. ప్రభాస్ బాహుబలి చేస్తున్నప్పుడే సుజీత్ సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా కథ చెప్పి ప్రభాస్ ని ఇంప్రెస్ చేశాడు.
అంతేకాదు ఈ సినిమా టీజర్ ని బాహుబలి 2 సినిమా రిలీజ్ రోజు నుంచి రిలీజ్ చేసి సాహో మీద విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేశాడు. ఇక సాహో తో సుజీత్ ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సాహో చూసిన సినీ విశ్లేషకులు సుజీత్ లో హాలీవుడ్ సినిమాని తీయగల సత్తా ఉందని ప్రశంసలు కురిపించారు. సాహో సినిమాకి సుజీత్ మేకింగ్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించిందని టాలీవుడ్ సీనియర్ దర్శకులు, నిర్మాతలు.. హీరోలు.. పొగడ్తలతో ముంచేశారు.
కాగా సాహో తర్వాత మళ్ళీ మెగాస్టార్ లూసీఫర్ రీమేక్ చేతికి వచ్చింది. ఈ సినిమా కోసం దాదాపు 3 నెలలు వర్క్ కూడా చేశాడు. కాని సుజీత్ చెప్పిన మార్పులు మెగాస్టార్ ని మెప్పించలేకపోయాయి. దాంతో ఆ స్థానంలో మరో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ వచ్చి చేరాడు. మెగాస్టార్ తో లూసీఫర్ రీమేక్ సినిమా గనక చేసుంటే సుజీత్ రేంజ్ విపరీతంగా పెరిపోయేది. ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం అంటే ఎంతో గొప్ప అవకాశం అని చెప్పాలి.
అయితే సుజీత్ కి రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. తెలుగులో ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఛత్రపతి సినిమాకి హిందీ రీమేక్. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో పరిచయం అవుతున్నాడు. కాగా ఈ సినిమా నుంచి కుడా సుజీత్ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా కేవలం రూమర్సేనని స్వయంగా సుజీత్ వెల్లడించాడు. అసలు బాలీవుడ్ లో నేనే సినిమా కమిటవలేదని తెలిపాడు. కాగా సుజీత్ నెక్స్ట్ సినిమా యూవీ క్రియేషన్స్ లో చేస్తాడని తెలుస్తోంది.