Sudigali Sudheer: ఢీ షోలో మళ్లీ సందడి చేయనున్న సుడిగాలి సుధీర్.. ఈసారి ఢీ షోకి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Sudigaali sudheer: సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. బుల్లితెర మీద మాత్రమే కాకుండా వెండి తెర మీద కూడా తన ప్రతిభ కనబరుస్తూ నటుడిగా, కమెడియన్ గా, మ్యూజిషియన్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మొదలైన తన ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు.ప్రస్తుత సుధీర్ ఒకవైపు టీవీ షోస్, మరొకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఢీ షోస్ మంచి హిట్ అవ్వటానికి సుధీర్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం ఢీ షో. ఎంతో కాలం మంచి రేటింగ్స్ తో కొనసాగిన ఢీ షో , సుధీర్ లేకపోవటంతో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ప్రదీప్, ఆది తమ కామెడీ తో నెట్టుకొస్తున్నారు. జడ్జ్ లు కూడా రేటింగ్స్ కోసం హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఐనప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. అందువల్ల మల్లెమాల వారు సుధీర్ ని ఢీ షో కి రప్పించటనికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఇది వరకు సుధీర్ కి ఢీ షో లో ఒక ఎపిసోడ్ కి 2 లక్షలు ఇవ్వగా ఇప్పుడు ఏకంగా 5 లక్షలు ఇస్తామని చెప్పటంతో సుధీర్ ఢీ షోకి రావటానికి ఒప్పుకున్నట్టు సమాచారం . తొందరలోనే సుధీర్ ఢీ షో కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వార్త విన్న సుధీర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షో లో మాత్రమే కాకుండా పలు సినిమాలలో కూడా హీరోగా నటిస్తున్నాడు.