చాలా చిన్న స్థాయి నుంచిమొదలయ్యి అభిమానులను సంపాదించుకొని టాలీవుడ్ హీరోగా ఎదగడం అనే మాట చిన్న విషయమేమి కాదు. అయితే మెయిన్ గా స్మాల్ స్క్రీన్ పై ఓ వ్యక్తిని చూసే జనం డబ్బు పెట్టి థియేటర్స్ దగ్గరకి వచ్చి టికెట్ కొని చూసే రేంజ్ ఉంది అంటే అతనికి తిరుగు లేదని చెప్పొచు.
అయితే ఇప్పుడు బుల్లితెర దగ్గర భారీ క్రేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. సుధీర్ హీరోగా మారాడు అంతా బాగానే ఉంది కానీ చాలా మందికి నిజంగా సుధీర్ ని హీరోగా యాక్సెప్ట్ చేసి జనం థియేటర్స్ కి వచ్చే సీనుందా అంటే ఈరోజు రిలీజ్ అయ్యిన తన “గాలోడు” సినిమా గట్టి ఆన్సర్ ఇచ్చిందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.
పెద్దగా బజ్ ఏది లేకపోయినా కూడా గాలోడు సినిమా పలు చోట్ల రిజిస్టర్ చేస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సహా సీడెడ్ లో గాలోడు సినిమాకి మధ్యాహ్నం షో లు నుంచి వసూళ్లు బాగా రిజిస్టర్ కావడం సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చగా మారింది.
వైజాగ్ లో అయితే ఓ థియేటర్స్ లో మధ్యాహ్నం షో ఒక్కటే 42 వేల గ్రాస్ ని ఈ చిత్రం వసూలు చేసిందట. దీనిబట్టి సుధీర్ కి థియేటర్స్ లో కూడా వచ్చి జనం చూసే రేంజ్ ఉందని ప్రూవ్ అయ్యింది. కానీ ఇంకా బెటర్ సినిమాలు గాని తాను ఎంచుకుంటే మరింత మంచి స్థాయిలోకి వెళ్తాడని చెప్పొచ్చు.