వామ్మో… ఒక సినిమా కోసం సుడిగాలి సుధీర్ ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడా..?

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన సుడిగాలి సుదీర్ మొదట జబర్దస్త్ లో ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత తన టాలెంట్ తో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిసి ఒక టీం గా ఏర్పడి ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను కన్నా సుధీర్ మరింత పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ యాంకర్ రష్మీతో క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ వల్ల సుధీర్ బాగా ఫేమస్ అయ్యాడు. మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందటమే కాకుండా పలు టీవి షో లకి యాంకరింగ్ చేస్తూ యాంకర్ గా కూడా గుర్తింపు పొందాడు.

ఇలా బుల్లితెర మీద బాగా ఫేమస్ అవ్వటంతో సుధీర్ కి వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా హీరోగా కూడా ఎన్నో అవకాశాలు అందుకున్నాడు. ఇప్పటికే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాలో సుధీర్ హీరోగా నటించాడు. ప్రస్తుతం సుధీర్ మూడు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ సుధీర్ నటించిన సినిమాలు మంచి హిట్ కాలేకపోయాయి. సుధీర్ బుల్లితెర మీద చేసే సందడి మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ నుండి బయటికి వచ్చి మాటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోస్ కోసం సుధీర్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఒక ఎపిసోడ్ కి దాదాపు 5 నుండి 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

ఇక హీరోగా అవకాశాలు అందుకున్న సుధీర్ సినిమాలకు కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. సుధీర్ ఒక సినిమా కోసం దాదాపు 60 నుండి 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో సుధీర్ నటించిన సినిమాలు దాదాపుగా మూడు నుండి ఐదు కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. బుల్లితెర ద్వారా సుదీర్ బాగా ఫేమస్ అవ్వటంతో నిర్మాతలు కూడా సుధీర్ కి కూడా భారీ స్థాయిలో రేమోనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న సినిమాలలో ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే సుధీర్ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.