స్ట్రాంగ్ రిపోర్ట్ – “SSMB28” టీజర్ కట్ పై అదిరే న్యూస్.!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కాగా దీనిపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.

కాగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా సెన్సేషనల్ హైప్ రాగా ఇప్పుడు అయితే ఈ అవైటెడ్ సినిమా నుంచి ఈ మే నెలలో భారీ ట్రీట్ ని కూడా మేకర్స్ సిద్ధం చేసేసారు. అయితే ఈ టీజర్ పై అయితే సినీ వర్గాల నుంచి స్ట్రాంగ్ రిపోర్ట్స్ యిప్పుడు వినిపిస్తున్నాయి.

ఆసక్తిగా ఈ టీజర్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి ఇంకా నెల రోజులు ఉన్నప్పటికీ ఈ వీడియో కట్ ఆల్రెడీ రెడీ చేసి సిద్ధంగా ఉందట. ఎడిటింగ్ వర్క్ అంతా అయ్యిపోయింది అని కూడా తెలుస్తుంది. అంతే కాకుండా ఇంకో ఆసక్తికర వార్త ఏమిటంటే ఈ టీజర్ ని 48 సెకండ్స్ ఉండేలా మేకర్స్ కట్ చేశారట.

దీనితో దీని తాలూకా రన్ టైం కూడా ఇపుడు లాక్ అయ్యిపోయింది అని చెప్పొచ్చు. ఇక ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో శ్రీ లీల మరియు పూజా హెగ్డే లు నటిస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.