సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి… అసలు విషయం బయట పెట్టిన మంగ్లీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్లుగా గుర్తింపు పొందారు. ఇలా ఫిమేల్ సింగర్లుగా గుర్తింపు పొందిన వారిలో మంగ్లీ కూడా ఒకరు. మొదట జానపద గాయనిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంగ్లీ ఆ తర్వాత సినిమాలలో వాడే అవకాశాలు అందుకొని సింగర్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా ఇప్పటివరకు మంగ్లీ పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో సింగర్ గా మంచి గుర్తింపు పొందిన మంగ్లీకి కన్నడలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కన్నడ భాషలో కూడా మంగ్లీ ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడింది.

ఇలా తెలుగు కన్నడ భాషలలో పాటలు పాడుతూ ఫేమస్ అయిన మంగ్లీ అప్పుడప్పుడు ప్రత్యేక కార్యక్రమాలలో కూడా పాల్గొంటు తన పాటలతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మంగ్లీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల బల్లారిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ కారుపై స్థానికులు రాళ్లతో దాడి చేసినట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించి అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఒక నోట్ కూడా రాసుకోచ్చింది. మంగ్లీ రాసిన ఈ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తనపై దాడి జరిగినట్లు వస్తున్న వార్తల గురించి స్పందించిన మంగ్లీ ” నాపై ఎటువంటి దాడి జరగలేదు. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు పనిగట్టుకుని నాగురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా మీద దాడి జరిగినట్లు వస్తున్న వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇటీవల బళ్లారిలో జరిగిన ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. కన్నడ ప్రేక్షకులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. వారు నాపై చూపించిన అభిమానం, ప్రేమ వర్ణించలేనిది. కేవలం నా ప్రతిష్టను దెబ్బతీయాలని నా గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆ వార్తలను ఖండించింది.