అయ్యబాబోయ్.. రాహుల్ సిప్లిగంజ్ షోలోనూ సేఫ్ గేమ్ ఆడిన లాస్య?

still lasya is in safe mode in rahul sipligunj show

లాస్య మంజునాథ్.. బిగ్ బాస్ షో ముందు వరకు తను కేవలం ఒక యాంకర్ మాత్రమే. కానీ.. ప్రస్తుతం తను చాలా పాపులర్ అయింది. కన్నింగ్ స్మైల్, సేఫ్ గేమ్, పప్పు పేరుతో తను సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతోంది లాస్య. తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడుతోందంటూ అన్నారు. కన్నింగ్ స్మైల్ అన్నారు. ఎప్పుడు వంటే చేస్తుంది కానీ.. గేమ్ మీద అస్సలు దృష్టి పెట్టలేదు అన్నారు. ఏది ఏమైనా.. ఇన్ని వారాలు లాస్య హౌస్ లో ఉండటం నిజంగా గ్రేట్. అన్ని విమర్శలను తట్టుకొని ఇన్నిరోజులు హౌస్ లో ఉండటం నిజంగా గ్రేట్. మాస్క్ వేసుకొని గేమ్ ఆడిందా? లేదా? అనేది ఇప్పుడు అనవసరం. ఎందుకంటే.. తను ఇప్పుడు హౌస్ లో లేదు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.

still lasya is in safe mode in rahul sipligunj show
still lasya is in safe mode in rahul sipligunj show

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న లాస్య.. అక్కడ కూడా సేఫ్ గేమే ఆడింది అన్నట్టుగా ఉంది ఆ ఇంటర్వ్యూ. అక్కడ కూడా చాలా సేఫ్ గా సమాధానాలు చెప్పింది. ఇంటి నుంచి బయటికి వచ్చినా.. రాహుల్ అడుగుతున్న ప్రశ్నలకు చాలా సేఫ్ గా సమాధానాలు చెప్పింది.

వామ్మో.. నువ్వు హౌస్ లోనే కాదు.. ఇక్కడ కూడా సేఫ్ గా ఉన్నావు. మాస్క్ అయితే తీయట్లేవు కదా.. అని రాహుల్ అంటే.. అవును.. ఇప్పుడు బయటికి వచ్చాం కదా.. మాస్కులు వేసుకొని బయట తిరగాలి అంటూ.. కరోనా మాస్కుల గురించి చెప్పింది లాస్య.

ఇంటి సభ్యుల గురించి నెగెటివ్ చెప్పమంటే మాత్రం.. ఎవ్వరి నెగెటివ్ ను కూడా అంతగా చెప్పలేకపోయింది లాస్య అంటే.. ఖచ్చితంగా లాస్య ఎప్పుడూ సేఫ్ సైడే ఉండాలి.. మనకెందుకులే.. ఎవరి నెగెటివ్స్ గురించి మనకెందుకు.. పన పనేదో మనం చూసుకుందాంలే.. అనే టైప్ లో లాస్య ఉన్నట్టు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది.

రాహుల్ తో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ఫుల్ వీడియోను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు.

LASYA FULL INTERVIEW I RAHUL SIPLIGUNJ I BIGG BOSS 4 BUZZZ I STAR MAA MUSIC