టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో సింగర్ గీతా మాధురి, యాక్టర్ అండ్ హోస్ట్ నందు జంట కూడా ఒకటి. టాలీవుడ్ లవ్లీ కపుల్ నందు- సింగర్ గీతామాధురి ఈ ఏడాది ప్రారంభంలో మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఫిబ్రవరి 10న గీతా మాధురి ఓ పండంటి మగ బిడ్డను ప్రసవించిందిఈ దంపతలకు ఇదివరకే దాక్షాయణి అనే కూతురు ఉంది. ఇక తమ కుమారుడికి ధృవధీర్ తారక్ అని నామకరణం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.
అటు నందు, ఇటు గీతా మాధురి ఇరు కుటుంబ సభ్యులు కలిసి శాస్త్రబద్ధంగా ఈ అన్నప్రాసన వేడుకను నిర్వహించారు. తమ తనయుడి ఎదురుగా సాంప్రదాయం ప్రకారం ఆహారం, పూలు, పుస్తకాలు, డబ్బులు పెట్టారు. అయితే గీత మాధురి కుమారుడు ముందుగా డబ్బును ముట్టుకున్నాడు. ఆ తర్వాత బంగారాన్ని పట్టుకున్నాడు. ఈ తంతు జరిగిన తర్వాత నందు, గీత కుటుంబంలోని పెద్ద వాళ్లంతా ఒక్కొక్కరిగా వచ్చి, ఆ బాలుడికి తీపి తినిపించి ఆశీర్వదించారు.
చివరికి కుటుంబ సభ్యులంతా కలిసి హారతి ఇచ్చి, ఈ అన్నప్రాసన వేడుకను పూర్తి చేశారు. ఈ స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన పిక్స్ ను గీతా మాధురి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అవి వైరలవుతున్నాయి. నందు దంపతుల పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఈ జంట ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారు.
2014లో గీతా మాధురి- నందుల వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. 2019లో ఈ సెలబ్రిటీ కపుల్ కు ఒక ఆడబిడ్డ జన్మించింది.గీతా మాధురి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సింగర్ అన్న విషయం తెలిసిందే. ఓ సింగింగ్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు నందు యాక్టర్ గా, హోస్ట్ గా బిజీగా ఉన్నారు.రీసెంట్ గా ‘వెల్కమ్ టు మోక్ష ఐలాండ్’, ‘వధువు’ వంటి వెబ్ సిరీస్ లలో కనిపించాడు.