Ram Charan: తండ్రిని మించిన తనయుడు రామ్ చరణ్: పొగడ్తలతో ముంచెత్తిన స్టార్ ప్రొడ్యూసర్

Ram Charan: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్ఆర్ మానియానే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా, ఆ సినిమాకు సంబంధించిన డైలాగులు, ముచ్చట్లే. ఇక సోషల్ మీడియాలో అయితే ఆ పేరు ఇప్పుడు మోగిపోతోందనే చెప్పవచ్చు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీని కళ్లారా చూసి, సంబరాలు చేసుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజులు వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్యాన్స్ కూడా విభిన్న రీతిలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్‌కి ఈ బర్త్‌డే చాలా స్పెషల్‌ గా నిలిచింది. ఎందుకంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కూడా ఊహించినట్టుగానే ఎనలేని రెస్పాన్స్‌ను అందుకోవడంతో ఆయన, ఆ సక్సెస్‌ను కూడా ఈ విధంగా సెలబ్రెట్ చేసుకునే అవకాశం వచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ చరణ్‌కు శుభాకాంక్షలు చేబుతూ పలువురు సెలబ్రెటీలు విష్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆర్‌ఆర్ఆర్ చిత్రం తర్వాత మరో ఘనత సాధించిన చెర్రీకి మామూలు ప్రేక్షకుల నుంచే కాదు ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు, మూవీ సక్సెక్‌ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ విషెస్ తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు మరొక స్టార్ ప్రొడ్యూసర్ పీవీపీ కూడా చేరి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. చరణ్‌ని ప్రశంసలతో కొనియాడుతూ, ఆయన తండ్రిని మించిన తనయుడు అంటూ ఆయన అభివర్ణించారు. ఇక చిరంజీవి కొడుకు కూడా ఓ చిరంజీవే .. చిరంజీవి గారి కొడుకు స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి రామ్ చరణ్ అనే స్థాయికి ఎదిగి, తన నటనతో దేశం మొత్తాన్ని మెప్పించిన నటుడు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఆర్‌ఆర్ఆర్ మూవీ భారీ సక్సెస్‌ను అందుకోవడంతో రామ్ చరణ్‌ నెక్స్ట్‌ ఏం సినిమాలు చేయబోతున్నాడా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఆయన తన 15వ చిత్రం దర్శకుడు శంకర్‌తో చేస్తున్న విషయం తెలిసిందే.