Pooja Hedge: పక్కా ప్రణాళికతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పూజా హెగ్డే… స్టార్ హీరోలతో పాటు వారికి కూడా గ్రీన్ సిగ్నల్?

Pooja Hedge:ప్రస్తుతం సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ఉన్న వారిలో బుట్టబొమ్మ పూజాహెగ్డే ఒకరు. ఈమె ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. కేవలం తెలుగు తమిళ చిత్రాల్లోనే కాకుండా హిందీ చిత్రాలలో కూడా పూజాహెగ్డే బిజీగా ఉన్నారు. ఇలా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పూజా హెగ్డే స్టార్ హీరోలకు మాత్రమే కాకుండా మీడియం రేంజ్ హీరోలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు సినీ పరిశ్రమలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న వారు కేవలం స్టార్ హీరోల డేట్స్ అడ్జస్ట్ కాక ఎంతో సతమతం అవుతున్న నేపథ్యంలో పూజా హెగ్డే ఓ వైపు స్టార్ హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా మరో వైపు కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ ఉన్న బుట్ట బొమ్మ మీడియం రేంజ్ హీరోలకు కూడా డేట్స్ ఇవ్వడంతో అసలు ఈమె తన ప్రణాళికను ఏవిధంగా సిద్ధం చేసుకుంటుంది అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అక్కినేని నాగ చైతన్య ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ నౌ అనుభవిస్తున్న పూజా హెగ్డే తిరిగి నాగచైతన్యకు అవకాశం ఇవ్వడం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ గా కొనసాగుతున్న ఈమె ఇలా మీడియం రేంజ్ హీరోలకు కూడా అవకాశాలు ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే సినిమాకు యస్ చెప్పడానికి ప్రతీసారి స్టార్ కాంబినేషనే మెయిన్‌ క్రైటీరియా కాదు. సమ్‌ టైమ్స్‌.. కథ, డైరెక్టర్‌ లాంటి విషయాలు కూడా ఎస్ చెప్పటానికి కారణమని పూజాహెగ్డే తెలియచేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ముందు ముందు ఈమెకు కథలో కంటెంట్ ఉంటే ఏ చిన్న హీరోలతో నటించడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.