స్టార్ హీరోయిన్ దుబాయ్ షేక్‌ల‌తో మీటింగులు దేనికి? క‌థ విన‌మ‌ని పిలిచి నిర్మాత అలా చేశాడా?

ఒక్క రాత్రి..కోటి ఆదాయం!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణానంత‌రం బాలీవుడ్ మాఫియా గురించి.. న‌ట‌వార‌సత్వం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ఈ కేసు విష‌యంలో సుశాంత్ కి న్యాయం జ‌ర‌గాల‌ని పోరాడుతున్న ఒక స్టార్ హీరోయిన్ ప్ర‌ముఖ చానెల్ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య పెను దుమారం రేపుతోంది.

star heroine meeting with dubai sheiks
star heroine meeting with dubai sheiks

ముఖ్యంగా బాలీవుడ్ లో అమ్మాయిల‌కు అవ‌కాశం పేరుతో ఎలా మ‌భ్య పెడ‌తారో ప‌రోక్షమైన వ్యాఖ్య‌ల‌తో బ‌య‌ట పెట్టేసింది ఆ స్టార్ హీరోయిన్. త‌నను ఓసారి స్క్రిప్టు వినేందుక‌ని పిలిచి దుబాయ్ వ్య‌క్తుల మ‌ధ్య‌లో కూచోబెట్టార‌ని.. త‌న‌ని దుబాయ్ కి స‌ర‌ఫ‌రా చేసేస్తారేమోన‌ని అనుకున్నాన‌ని స‌ద‌రు స్టార్ హీరోయిన్ అన‌డం చూస్తుంటే .. ఆ నిర్మాత‌ల భండారం బ‌య‌ట‌ప‌డింది.

ఇక సుశాంత్ సింగ్ కేసులో స‌ద‌రు స్టార్ హీరోయిన్ ఆ నిర్మాత పేరును ప‌దే ప‌దే బ‌య‌ట‌పెడుతోంది. త‌న‌కు కెరీర్ ఆరంభం తొలి చిత్ర అవ‌కాశం క‌ల్పించిన ఆ నిర్మాత వేధింపుల‌పై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసింది. తాజాగా దుబాయ్ షేక్ ల వ్య‌వ‌హారం త‌ర‌పైకి రావడం.. ఇక ఈ వ్య‌వ‌హారంలో ఒక క్యారెక్ట‌ర్ న‌టుడు త‌న‌ను నిర్మాత‌ల‌కు ప‌రిచ‌యం చేశాడ‌ని చెప్ప‌డం .. ఇదంతా చూస్తుంటే తేడా కొడుతోంది! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అస‌లింత‌కీ ఆమె క‌థ వినాలంటే దుబాయ్ వ్య‌క్తులు ఎందుకు? అన్న‌దే ఇప్పుడు మిస్ట‌రీగా చెప్పుకుంటున్నారు.