టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ప్రభాస్ ఒకరు కాగా ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలలో ఎక్కువ శాతం హిట్లే కావడం గమనార్హం. ఒకవైపు స్టార్ డైరెక్టర్లతో మరోవైపు యంగ్ డైరెక్టర్లతో పని చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న హీరోగా ప్రభాస్ కు పేరుంది. గత కొన్నేళ్లలో ప్రభాస్ సినిమాల బడ్జెట్లు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాపైనా ప్రభాస్ మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు.

అయితే ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరనే ప్రశ్నకు చాలామంది రామ్ చరణ్ సమాధానం అయ్యి ఉండవచ్చని భావిస్తారు. అయితే ఒక ఇంటర్య్వూలో ప్రభాస్ మాట్లాడుతూ బన్నీ, ఎన్టీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లన్నీ ఊహించని స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమలు ఫ్లాప్ అయ్యే అవకాశమే లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పాన్ వరల్డ్ హీరోగా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాసినిమాకు ప్రభాస్ 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ప్రభాస్ తను హీరోగా నటిస్తున్న ఐదు సినిమాల ద్వారా తీసుకుంటున్న పారితోషికం ఏకంగా 600 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రభాస్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.