‘బొమ్మరిల్లు భాస్కర్‌’ కాంబినేషన్‌ లో సిద్దు జొన్నలగడ్డ.. జాక్‌ టైటిల్ ను ఖరారు చేస్తూ ప్రకటన!

స్టార్‌ బాయ్‌ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, స్క్రీన్‌ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ.. తన మల్టీటాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాతో తిరుగులేని బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన’ టిల్లు స్క్వేర్‌’ సినిమాతో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న.. ఈ చిత్రానికి టైటిల్‌ ఖరారు చేస్తూ.. తాజాగా మేకర్స్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘జాక్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా తెలుపుతూ.. సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు స్పెషల్‌గా టైటిల్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు.. మేకర్స్‌ విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘కొంచెం క్రాక్‌’ అనేది ట్యాగ్‌లైన్‌.

ఈ పోస్టర్‌లో రెండు గన్స్‌ పట్టుకుని.. ఒక డాన్‌లా సిద్దు జొన్నలగడ్డ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘జాక్‌’ టైటిల్‌ సోషల్‌ విూడియాలో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ పోస్టర్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి త్వరలోనే అప్‌డేట్స్‌ ఉంటాయని మేకర్స్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. చాలా గ్యాప్‌ తర్వాత ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌’ వంటి సినిమాతో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆ సినిమా ఆయనకు మంచి గుర్తింపునే ఇచ్చింది. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ హీరోలను డైరెక్ట్‌ చేసిన ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో.. యూత్‌ సెన్సేషన్‌ సిద్దు సినిమా చేస్తున్నాడనే ప్రకటన వచ్చినప్పుడే ఈ సినిమాపై భారీగా క్రేజ్‌ ఏర్పడింది. పూర్తిగా వినోదాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా.. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు.