థమన్ నాన్ స్టాప్ బాదుడు

మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం బిజీ బిజీగా బాధేస్తున్న కంపోజర్ ఎస్ఎస్.థమన్. ఈ ఏడాది ఆరంభంలోనే అల.. వైకుంఠపురములో అంటూ ఒక సరికొత్త ఆల్బమ్ ఇచ్చిన థమన్ ఆడియెన్స్ నుంచి సరికొత్త రెస్పెక్ట్ అయితే అందుకున్నాడు. అయితే చివరికి అందులో కొన్ని పాటలు కూడా కాపీ అని క్లారిటీ వచ్చింది. ఇక యధావిధిగా ట్రోలింగ్ కు గురైన థమన్ ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా బిజీ కానున్నాడు.

దాదాపు 10సినిమాలకుపైగా మ్యూజిక్ అందిస్తున్న థమన్ త్వరలో పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ మరియు అయ్యప్పనమ్ కోషియం రీమేక్, మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాట, బాలయ్య-బోయపాటి యొక్క బిబి3, వరుణ్ తేజ్  బాక్సర్ వంటి సినిమాలకే కాకుండా, నాని టక్ జగదీష్ సినిమాకు కూడా ట్యూన్స్ సెట్ చేస్తున్నాడు.

తమిళ స్టార్ సింబు  ఈశ్వరున్ అలాగే కన్నడలో కూడా రెండు సినిమాలకు పని చేస్తున్నాడు. ఒక విధంగా థమన్ తీరిక లేకుండా గడపుతున్నాడనే చెప్పాలి. అయితే అప్పుడప్పుడు కాపీ ఆరోపణలను తప్పించుకోలేక పోతున్నాడు మన థమన్ అన్న. ఇటీవల రవితేజ క్రాక్ సినిమాలో భలేగా దొరికావే బంగారం అనే పాట కూడా కాపీ అని తెలిపోయింది. బిజీ బిజీ లైఫ్ లో ఒకదానితో ఒకటి సంబందం లేకుండా ట్యూన్స్ చేయడం అంటే కష్టం. మరి 2021లో థమన్ నాన్ స్టాప్ బాదుడులో మళ్ళీ  ఏమైనా రిపీట్ అవుతాయో లేదో చూడాలి.