హీరోలు ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఆ క్రేజ్‌తో భారీ కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఒక్కో హీరో మూడు నుంచి నాలుగు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అంతే కాకుండా ఒక్కో యాడ్‌కు తమకున్న క్రేజ్‌ని బట్టి భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
హీరోలకు మించిన క్రేజ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన రాజమౌళి కూడా ఓ ప్రకటన చేశారు. గతంలో ఆయన ప్రకటన చేస్తున్నట్లు వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, ఇప్పుడు ఈ యాడ్ కి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
పాపులర్ మోబైల్ బ్రాండ్ ఒప్పోకు రాజమౌళి ప్రచార కర్తగా మారారు. ఇటీవలే సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జక్కన్న ఇటీవల యాడ్ షూట్ లో పాల్గొనగా, ఇప్పుడు ఆ యాడ్ ప్రజల ముందుకు వచ్చింది.ఈ యాడ్‍కు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను ఒప్పో వెల్లడించింది. దీంట్లో రాజమౌళి డ్యుయల్ రోల్‍లో కనిపించాడు. స్క్రీన్‍పై రెండు పాత్రలుగా కనిపించాడు.
రాజమౌళి నటించిన తొలి కమర్షియల్ యాడ్ ఇదే కావడం విశేషం. క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి, రౌండ్ నెక్ టీషర్ట్..మ్యాచింగ్ ప్యాంట్‌తో రాజమౌళి స్టైల్‌గా కనిపిస్తున్న తీరు ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజమౌళి స్లైలిష్‌గా కనిపిస్తున్నారు.
ఇది జస్ట్ టీజర్ మాత్రమే, పూర్తి యాడ్‌ని త్వరలోనే విడుదల చేయనున్నారట. త్వరలో సూపర్ స్టార్ మహేష్‌తో రాజమౌళి ఓభారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈమూవీని ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియానా జోన్స్ లేదా జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమాని తెరపైకి తీసుకురానున్నారు.