KGF 2ని బీట్ చేసిన RRR

దర్శక దిగ్గజం రాజమౌళి అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్ గత ఏడాది రిలీజ్ ఎంత సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే. రామ్ చరణ్, తారక్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఇక ఆర్ఆర్ఆర్ పలు అంతర్జాతీయ అవార్డులని సైతం సొంతం చేసుకుంది. తాజాగా 95వ ఆస్కార్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇండియన్ ఫిల్మ్ చరిత్రలో ఇప్పటి వరకు సాధ్యం కాని అరుదైన రికార్డుని ఈ అవార్డుతో ఆర్ఆర్ఆర్ సృష్టించింది. ఇక రామ్ చరణ్, తారక్, రాజమౌళికి ఈ మూవీ గ్లోబల్ లెవల్ లో ప్రమోషన్ ఇచ్చింది. ఆస్కార్ అవార్డుని అందుకోవడం ద్వారా ఇప్పుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్ తారక్ సినిమాల మీద కూడా భారీ అంచనాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికి జపాన్ లో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్స్ లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2ని బీట్ చేసి ఏకంగా మూడో స్థానంలోకి వచ్చేసింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కూడా కలవడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డ్ బ్రేక్ అయ్యింది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో అమీర్ ఖాన్ దంగల్ సినిమా నిలించింది.

ఈ మూవీ 1958 కోట్ల కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది. రెండో స్థానంలో బాహుబలి 2 మూవీ ఉంది. ఈ సినిమా 1810 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో స్థానంలోకి ఆర్ఆర్ఆర్ 1236 కోట్లతో రావడం విశేషం. నాలుగో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ ఉంది. ఈ మూవీ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా 1233 గా ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ నిలవడం విశేషం. ఈ సినిమా ఇప్పటి వరకు 1048 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పటికి థియేటర్స్ లో ప్రదర్శితం అవుతుంది .