“సలార్” సెట్స్ అలా వాడేసిన శృతి హాసన్.??

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం డెఫినెట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “సలార్ సీజ్ ఫైర్” అని చెప్పాలి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా స్టార్ బ్యూటీ శృతి హాసన్ నటించింది.

అయితే ఈ చిత్రం కోసం అయితే నిర్మాణ సంస్థ హోంబేలె ఫిలిమ్స్ వారు తమ కెరీర్ లో ఏ సినిమాకి కూడా పెట్టని భారీ ఖర్చు పెట్టారు. ఓ రకంగా సినిమా ఆలస్యానికి ఇది కూడా ఓ కారణం కాగా ఈ సినిమాలో చాలానే భారీ సెట్టింగ్స్ మేకర్స్ వేశారు కానీ కొన్ని అనవసరమైన సెట్స్ ని మాత్రం హీరోయిన్ శృతి హాసన్ వాడేసుకుంది అని అంటున్నారు.

కాగా శృతి హాసన్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి సింగర్ అండ్ కంపోజర్ అని కూడా చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అలా ఆమె ప్లాన్ చేసుకున్న ఓ లేటెస్ట్ సాంగ్ కోసం మొత్తం సలార్ సెట్స్ ని వాడి పడేసిందట. అయితే సినిమాలో కనిపించే సెట్స్ కాకుండా కనిపించని సెట్స్ ని ఆమె వాడుకుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ సాంగ్ తాలూకా విజువల్స్ చూసినా కూడా సలార్ తరహాలోనే బ్లాక్ అండ్ వైట్ గానే కనిపిస్తున్నాయి. దీనితో ఈ సాంగ్ విజువల్స్ అండ్ శృతి హాసన్ గ్లామర్ షో వైరల్ గా మారింది.
https://x.com/actresshunt1/status/1717494709688599003?s=20