“సలార్” లో తన రోల్ రివీల్ చేసేసిన శృతి హాసన్.. 

Sruthi hasan comments on prabhas and prashanth neel

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ ఉన్నటువంటి పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మాస్ ఏక్షన్ డ్రామా “సలార్ ది సీజ్ ఫైర్” కూడా ఒకటి. ఇంకా నెల రోజులు సమయం ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రంపై హైప్ ఇపుడు మాములు స్థాయిలో లేదు.

దీనితో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అంతకంతకు ఎక్కువ అవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్ తో ఆమె మొదటిసారి చేసిన సినిమా కూడా ఇదే. మరి ఈ చిత్రంలో శృతి హాసన్ ఎలాంటి రోల్ చేస్తుంది అనేది స్టార్టింగ్ లో అయితే ఓ రూమర్ వచ్చింది.

ఈ సినిమాలో ఆమె ఒక జర్నలిస్ట్ గా కనిపిస్తుంది అని అన్నారు కానీ ఇపుడు అయితే అసలు శృతి హాసన్ ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తుందో కన్ఫర్మ్ అయ్యింది. కాగా లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో శృతి హాసన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను ఓ టీచర్ రోల్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేసింది.

అయితే ఇంత సింపుల్ రోల్ లో అది కూడా ఈ భారీ చిత్రంలో అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే..ఇక ఇదిలా ఉండగా ఈమె మొన్ననే సినిమాకి తన లాస్ట్ వర్క్ డబ్బింగ్ ని ఫినిష్ చేసేసింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 28 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.