“సలార్” కోసం ఫైనల్ వర్క్ పూర్తి చేసిన శృతి హాసన్..!

Sruthi hasan comments on prabhas and prashanth neel

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఆల్రెడీ యూఎస్ లో అయితే బుకింగ్స్ స్టార్ట్ అయ్యి నెల ముందు నుంచే హంగామా మొదలైంది.

ఇక చిత్ర యూనిట్ కూడా చాలా సెక్యూర్ గా ఈ చిత్రాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇపుడు ఈ చిత్రంపై హీరోయిన్ శృతి హాసన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. మరి ఈమె అయితే జస్ట్ రీసెంట్ గానే సినిమా డబ్బింగ్ ని స్టార్ట్ చేయగా నిన్న రాత్రితో అయితే అయితే తన కంప్లీట్ పార్ట్ ని సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేసేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

దీనితో శృతి హాసన్ కి ఉన్న చిట్ట చివరి వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది అని చెప్పాలి. ఇంకా మిగతా నటులు కూడా ఒకొకరిగా తమ వర్క్స్ ఫినిష్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ సంగీత దర్శకుడు రవి బాసృర్ తో కలిసి సినిమా మ్యూజిక్ పరంగా కూడా చాలా కేర్ వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ అయితే ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా సెన్సేషనల్ రిలీజ్ కాబోతుంది.