Sri Vishnu : ఖాకీ డ్రెస్ లో శ్రీవిష్ణు… అల్లూరి గా సినిమా టైటిల్… ఆసక్తి పెంచుతున్న పోస్టర్..!

 

Sri Vishnu : శ్రీవిష్ణు తనదయినా శైలిలో సినిమాలు చేస్తూ తన సినిమాలు విలక్షణంగా ఉండేలా చూసుకుంటున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం లో యూట్యూబ్ లో బేవార్స్ అనే షార్ట్ ఫిల్మ్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు.తరువాత సినిమాలో సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ తన కెరీర్ మొదలు పెట్టాడు శ్రీ విష్ణు. తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా బ్రేక్ ఇచ్చింది.ఇటీవల వచ్చిన గాలి సంపత్, రాజ రాజ చోర తో ప్రేక్షకులను అలరించారు.

ఇపుడు తాజాగా అల్లూరి సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు.మాస్ మహారాజ రవి తేజ ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమా లో శ్రీవిష్ణు ఏ ఎస్ రామరాజు పాత్రను పోషిస్తున్నారు.ఈ సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించునున్నారు. శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ గా సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి.


విడుదల ఐన ఈ సినిమా పోస్టర్ లో టైటిల్ లోగో లో రెండు గున్నులు కనిపిస్తున్నాయి. అలాగే శ్రీవిష్ణు పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ లో హీరో ముఖం సరిగా కనిపించదు.దీన్ని బట్టి శ్రీ విష్ణు ఈ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించునున్నట్లు తెలుస్తోంది.ఇది ఒక యాక్షన్ డ్రామా అన్న వార్తలు వినిపిస్తున్నాయ్. చూడాలి మొదటిసారి ఇలాంటి యాక్షన్ డ్రామా లో శ్రీ విష్ణు ఎలా మెప్పుస్తారో మరి.