అఫీషియల్ : శ్రీనువైట్ల ఒక సినిమా ఆఫ్ మరో సినిమా ఆన్ 

Srinu Vaitla trying to cast stars in his next movies

టాలీవుడ్ సినిమా దగ్గర వరుస హిట్ సినిమాలతో ఒక్కసారిగా భారీ స్టార్డం అందుకున్న హీరోలతో పాటుగా దర్శకులు కూడా ఉన్నారు. మరి అలాంటి స్టార్ దర్శకుల్లో “దూకుడు” అనే సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఉన్న అందరి దర్శకులని పక్కకి నెట్టి షాకిచ్చిన ఎంటర్టైనర్ దర్శకుడు శ్రీను వైట్ల.

అయితే తన భారీ సక్సెస్ కి అలాగే ఫెయిల్యూర్ కి కూడా తానే కారణం అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే దూకుడు సక్సెస్ ఇచ్చిన స్టార్డం తాను నిలుపుకోలేకపోయాడు. నెక్స్ట్ జస్ట్ యావరేజ్, ప్లాప్ చిత్రాలతోనే మళ్ళీ తన మార్కెట్ ని పోగొట్టుకున్నాడు.

దీనితో మళ్ళీ తన హిట్ హీరో మంచు విష్ణుతోనే క్రేజీ సీక్వెల్ చిత్రం “ఢీ డబుల్ డోస్” అంటూ ఓ సినిమా స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళు షూటింగ్ బాగానే జరిగింది కానీ ఈ సినిమా షూటింగ్ అయితే తర్వాత పత్తా లేకుండా పోయింది. దీనితో ఈ సినిమా నిలిచిపోయింది అని రూమర్స్ వచ్చాయి.

అయితే ఇప్పుడు అఫీషియల్ గా ఈ సినిమా ఆగిపోయింది అని కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే ఈ సినిమా ఆపేసి శ్రీను వైట్ల టాలీవుడ్ హీరో గోపీచంద్ తో సరికొత్త సినిమాని ఇపుడు స్టార్ట్ చేశారు. కాగా ఈరోజే హైదరాబాద్ లో ఈ సినిమాకి ఫార్మల్ ముహూర్తం కూడా చేసేసారు. సో శ్రీను వైట్ల ఒక సినిమా ఆపేసి ఇంకో సినిమా ఆన్ చేసాడని చెప్పాలి.