ఇంటికెళ్తే అదే పని.. సుధీర్ పరువుదీసిన గెటప్ శ్రీను

Srinu Satires On Sudheer In Big Celebrity Challenge

సుడిగాలి సుధీర్ అంటే అందరికీ ఓ ఘటన గుర్తుకు వస్తుంది. బ్రూస్ లీలో చిరంజీవి ఎంట్రీకి తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను సుధీర్ వాడినంతగా మరేతర ఆర్టిస్ట్‌లు వాడి ఉండరు. షో ఏదైనా సరే ఈవెంట్ ఏదైనా సరే సుధీర్ మాత్రం ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసుకుని ఎంట్రీ ఇస్తూ.. స్టైల్‌గా కళ్లద్దాలను పెట్టుకున్ని పోజిలిస్తాడు. అలా తల పైకి ఎత్తి స్లో మోషన్‌లో కళ్లద్దాలను పెట్టుకుంటాడు. ఈ సంగతి అందరికీ తెలిసిందే.

Srinu Satires On Sudheer In Big Celebrity Challenge
Srinu Satires On Sudheer In Big Celebrity Challenge

తాజాగా గెటప్ శ్రీను, సుధీర్ ఆటో రాం ప్రసాద్‌లు సుమ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో అక్కడా కూడా ఈ ముగ్గురు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు కామెంట్లు, సెటైర్లు వేస్తూ రచ్చ చేశారు. అంతే కాకుండా సుధీర్ శ్రీను రాం ప్రసాద్‌లను సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది. యాంకరింగ్ అంటే తెలుసా? యాంకర్ అంటే ముందు స్పాన్సర్ల పేర్లు టకటకా చెప్పడం వచ్చి ఉండాలంటూ కౌంటర్లు వేసింది.

అసలు నీకు ఏం వచ్చంటూ సుమ కౌంటర్లు వేసింది. అదే సమయంలో గెటప్ శ్రీను సుధీర్ పరువుదీసేశాడు. షోలో అయితే ఇలా అంటూ తల పైకి ఎత్తి కళ్లజోడు పెట్టుకుంటాడు.. ఇంటికి వెళ్తే ఇలా అంటూ ఓ పెగ్ వేస్తాడంటూ చెప్పుకొచ్చాడు. కానీ సుధీర్ స్కిట్స్ మేరకు అలాంటి పనులు చేస్తాడని రియల్‌గా అలాంటి వాడు కాదని అందరూ చెబుతుంటారు. కానీ వీకెండ్‌లో మాత్రం సుధీర్ పబ్‌లో రచ్చ చేస్తాడని తెలిసిందే.