పొట్టి బట్టలతో సోషల్ మీడియా మరొకసారి రచ్చ చేసిన శ్రీముఖి.. ఫోటోలు వైరల్..!

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి ఈటీవీలో ప్రసారమైన పటాస్ షో లో యాంకర్ గా వ్యవహరించి బాగా పాపులర్ అయింది. తన మాటలతో అల్లరి చేష్టలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీముఖి సినిమాలలో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది. మొదట అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించి నటిగా కూడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా శ్రీముఖి హీరోయిన్ గా కూడా ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది.

ఇదిలా ఉండగా శ్రీముఖి ప్రస్తుతం ప్రసారమవుతున్న సరిగమప, జాతి రత్నాలు, మొగుడ్స్ vs పెళ్ళాంస్ వంటి షో లకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. ఇలా టీవీ షో లు, సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. శ్రీముఖి తనకి సంబంధించిన ఫోటోలు, ఫన్నీ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రతివారం టీవీ షోస్ కోసం ఫోటో షూట్ చేయించుకొని ఆ అందమైన ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు.

ఇలా ప్రతి వారం తన అందంతో నెటిజెన్స్ ని అలరిస్తున్న శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో శ్రీముఖి మోకాళ్ళ పై వరకు పొట్టి బ్లాక్ డ్రెస్ వేసుకొని, నల్ల కళ్లజోడు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంతే కాకుండా ఈ డ్రెస్ లో శ్రీముఖి డాన్సు చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి సంబంధించిన ఈ ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా టీవీ షో లు, సినిమాలు, సోషల్ మీడియాలో ద్వారా శ్రీముఖి నిత్యం అభిమానులను , ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.