మెగా క్యాంప్‌లోకి ‘దసరా’ డైరెక్టర్.!

నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాని ‘రంగస్థలం’తో పోల్చుతున్నారు కొందరు. సుకుమార్ శిష్యుల్లో ఒకడైన శ్రీకాంత్ ఓదెల, ‘దసరా’ సినిమాని రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

కాగా, శ్రీకాంత్ ఓదెలకు మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చిందట. ఓ రెండు సినిమాలు చూచాయిగా ఓకే అయ్యాయట కూడా. అందులో ఒకటి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోందిట కూడా. ఎవరా హీరో.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

‘దసరా’ రిలీజ్‌కి చాలా రోజుల ముందే మెగా కాంపౌండ్ నుంచి శ్రీకాంత్ ఓదెలకు పిలుపు వెళ్ళిందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. అయితే, ‘దసరా’ విడుదలయ్యాక శ్రీకాంత్ ఓదెల మీద మిక్స్‌డ్ కామెంట్స్ వస్తున్నాయ్.

అయినాగానీ, మెగా కాంపౌండ్‌లో చేయబోయే రెండు సినిమాల విషయంలో శ్రీకాంత్ ఓదెలకు ఇబ్బందేమీ వుండకపోవచ్చు.