ఆ పాత్రలో నటించి డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకే అసహ్యంగా అనిపించింది: శ్రీకాంత్ అయ్యంగార్

డా. మోహన్ దర్శకత్వంలో శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, నవీన్ చంద్ర, డా. మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న టువంటి చిత్రం 1997.ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.తాజాగా ఈ చిత్రంలో ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ సినిమాలోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ…నేను వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా మోహన్ గారు అక్కడికి వచ్చి తనకు కథ చెప్పారని కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని తెలిపారు.1997 సినిమా అమ్మాయిల పై అత్యాచారం చేసి వారి పై పెట్రోల్ పోసి తగలబెట్టి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఈ ఇందులో ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నేను కనిపిస్తానని తెలిపారు.

ఇక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత డబ్బింగ్ చెప్పే సమయంలో నా పాత్ర ఎంతో అసహ్యంగా అనిపించిందనీ శ్రీకాంత్ అయ్యంగార్ ఈ సినిమాలో తన పాత్ర గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఇక తను తన జీవితంలో మూడు పాత్రలలో నటించకూడదని భావించినట్లు తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్, హీరోయిన్, హీరో పాత్రలలో తప్ప అన్ని పాత్రలలో నటిస్తానని తెలిపారు. ఇండస్ట్రీలో తన గాడ్ ఫాదర్ వర్మ అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.