నిహారిక పెళ్లి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయిందన్న సంగతి తెలిసిందే. జాతీయ మీడియా సైతం నిహారిక పెళ్లిని ఫుల్లుగా కవర్ చేసింది. నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిహారిక పెళ్లికి సంబంధించిన విశేషాలే కనిపించాయి. మీడియా కూడా అంతే రేంజ్‌లో నిహారిక పెళ్లిని కవర్ చేసింది. ఇక యూట్యూబ్ సంగతి సరేసరే. ఎవ్వరైనా ఈ పొరబాటున యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ నిహారిక పెళ్లికి సంబంధించిన వీడియోలే కనిపిస్తాయి.
నిహారిక పెళ్లికి చార్టెడ్ ఫ్లైట్‌లు, చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?, నిహారిక పెళ్లిలో పవన్ కళ్యాణ్ సందడి.. నిహారిక పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా?.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నాగబాబు.. మెగా హీరోల కానుకల విలువ ఎంతో తెలుసా.. ఇలా రకరకాల థంబ్ నెయిల్స్‌తో యూట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వీడియోలు పడి ఉన్నాయి. ఇలా నిహారిక పెళ్లిని మీడియా కవరేజ్ చేయడం, వాటిని అలా ఎగబడి చూడటంపై శ్రీ రెడ్డి ఫైర్ అయింది.
ఊర్లో పెళ్లికి కుక్కల హడావాడి అన్నట్టు నాగబాబు కూతురి పెళ్లి అయితే ఇంత చేయాలా? మీడియా కూడా అంత కవరేజ్ చేయాల్సిన పని లేదు.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. పవన్ కళ్యాణ్ వచ్చాడు.. వాడొచ్చాడు.. వీడొచ్చాడు అంటూ వీడియోలు కనిపిస్తున్నాయి.. ఏదైనా పనికొచ్చే పనులు చేయండిరా. థూ.. రైతుల సమస్యలు పట్టవు, అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే పట్టదు అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోయింది. తాను అంటోంది మీడియాను కాదని.. ఎవరైతే పిసుక్కుంటూ వీడియోలను చూస్తున్నారో వారినే అంటూ చివరికి ఓ ఝలక్ ఇచ్చింది.