ఎక్కడి సుశాంత్ సింగ్ కేసు.. ఎక్కడి డ్రగ్స్ దందా.. ఎక్కడి రియా చక్రవర్తి.. ఎక్కడి రకుల్ ప్రీత్ సింగ్. అసలు.. ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా ఉన్నాయి కదా.. కానీ.. సుశాంత్ మృతి కేసు మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోతోంది. ఆయన మృతి కేసు ప్రస్తుతం పక్కన పడిపోయింది. ఇప్పుడు కేసు కూడా సీబీఐ నుంచి ఎన్సీబీ అధికారుల చేతికి వెళ్లింది.
ఇప్పుడు డ్రగ్స్ దందా మీద ఎన్సీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సుశాంత్ కు నిషేధిత డ్రగ్స్ ఎక్కించినట్టు రియా ఎన్సీబీ అధికారుల ముందు ఒప్పుకున్న విషయం తెలిసిందే. తనను అరెస్ట్ చేసి డ్రగ్స్ దందా గురించి అసలు నిజాలు రాబట్టారు. దీంతో డ్రగ్స్ తో సంబంధం ఉన్న మరో 25 మంది ప్రముఖుల పేర్లను రియా బయటపెట్టినట్టు తెలుస్తోంది. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్.. ఇంకా చాలామంది సినీ ప్రముఖుల పేర్లను రియా ఎన్సీబీ అధికారులకు చెప్పిందట.
ఇక.. రకుల్ ప్రీత్ సింగ్ పేరు రాగానే టాలీవుడ్ మొత్తం ప్రస్తుతం షేక్ అవుతోంది. రకుల్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడంతోనే వెంటనే వివాదస్పద నటి శ్రీరెడ్డి అందుకుంది. రకుల్ పై మండిపడిపోయింది.
తన ఫేస్ బుక్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేసి రకుల్ పై ఎక్కేసింది. నీ రంకు పురాణం ఎవరికి తెలియదు.. అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోయింది. నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు… ఇతర విషయాల్లో నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెద్ద పతితల్లా ఫీల్ అయ్యారు కదా.. ఇప్పుడేమైంది. నీ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది రకుల్.. అంటూ శ్రీరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు.. డ్రగ్స్ కూడా ఏం లేవు. ఎందుకు మా ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తున్నారు..అంటూ రకుల్, మంచు లక్ష్మీ తెగ ఏడిచేశారు. ఇక్కడ మీడియా ముందు ఒకలా ఉంటుంది రకుల్.. బాలీవుడ్ లో మరోలా మాట్లాడుతుంది. ఇక్కడేమో ఏం లేదు అంటుంది.. అక్కడికెళ్లి.. కాస్టింగ్ కౌచ్ ఉంది.. డ్రగ్స్ ఉన్నాయి అంటుంది. బాలీవుడ్ లో మాట్లాడితే టాలీవుడ్ లో తెలియదా? టాలీవుడ్ లో మాట్లాడితే బాలీవుడ్ లో తెలియదా? అప్పుడు నన్ను నిందించారు.. ఇఫ్పుడు ఏమైంది.. అందరి జాతకాలు బయటపడుతాయి. ఎవరి కర్మను వాళ్లు అనుభవించాల్సిందే.. అంటూ రకుల్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి.