Sri Reddy: పంట పొలాల మధ్య శ్రీరెడ్డి…. నిర్ఘాంతపోతున్న నెటిజన్స్!

Sri Reddy: కాస్టింగ్ కౌచ్‌తో పాపులారిటీని సొంత చేసుకున్న నటి శ్రీ రెడ్డి. వివిధ వివాదాల అనంతరం కొంత గ్యాప్‌ తీసుకొని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించి విభిన్న వీడియోలు చేస్తూ ఇప్పు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్‌కి బాధితులైన ఆడవాళ్లకు న్యాయం చేయాలని ఎంతో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ, మెగా ఫ్యామిలీని అనరాని మాటలు అని వైరల్‌గా మారింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవలే నేను తప్పు చేశాను, క్షమించండి అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

ఇక ఈ మధ్య కాలంలో తన వీడియోలతో శ్రీరెడ్డి ప్రేక్షకులను కూడా మచ్చిక చేసుకుంంటుందనే వార్తలు రాకపోలేదు. ఒకప్పటి ఆమె వ్యక్తిత్వానికి, ఇప్పుడు ఆమె నడుచుకుంటున్న విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అలా చేసింది ఈమేనా అని నిర్ఘాంతపోయి చూస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ కోసం ఆమె చేసిన ప్రయత్నానికి కొందరు ప్రశంసించగా, చాలా మంది మాత్రం ఆమెను విమర్శించారు. దానికి తోడు అప్పట్లో ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పైనా వ్యాఖ్యలు చేయడంతో అవి దుమారంగా మారి, సంచలనం సృష్టించాయి.

అయితే ఆమె తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులతో షో చేసే శ్రీరెడ్డి, ఈ వీడియోలో చీరకట్టులో కనిపిస్తూ , పంట పొలాల మధ్య తిరుగుతూ వంటలు చేస్తుంది. అప్పట్లో ఓ వీడియోలో చేపల కూర చేసిన ఈమె, ఈ సారి మేక తొడ కూర అంటూ అలరించింది. అంతే కాదు పిల్లల మధ్య కూర్చొని, తాను చేసిన వంటను ఆస్వాదించింది. ఈ వీడియోను చూసిన వీక్షకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అంతే కాకుండా ఆమె తన పంట, పొలాలను చూపిస్తూ, అందులో భాగంగా తాను కొనుగోలు చేసిన స్థలాన్ని చూపిస్తుంది. అంతా బాగుంటే ఈ పల్లె వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలని ఉందని చెప్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా అక్కడ తన పొలంలో వరినాట్లు వేస్తూ, అక్కడ పని చేస్తున్న కూలీలతో ముచ్చటించడం సరదాగా అనిపిస్తుంది. ఇలా శ్రీరెడ్డిలో వచ్చిన మార్పును చూసి కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా నిజమేనా అంటూ పలు కామెంట్స్ చేస్తున్నారు.