బిగ్‌బాస్‌లో అది చేస్తావా? అని అడిగారట.. గుట్టువిప్పిన శ్రీరెడ్డి

Sri Reddy ABout Bigg Boss 4 Telugu Show And Contestants Exposing

శ్రీరెడ్డి బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన నోటికి అదుపుచెప్పే వారెవ్వరూ ఉండరు. ఇక ఒక్కొక్కరి గుట్టు, వారి జాతకాలను ఏ సమయంలో బయట పెడుతుందో చెప్పలేం. అయితే ఆమె ఎంత చేసినా ఎడిటింగ్‌లో తీసేయొచ్చు. కానీ శ్రీరెడ్డి బిగ్‌బాస్‌లో ఉందంటే మాత్రం అది ఓ సెన్సేషన్ అవ్వడం గ్యారెంటీ. అయితే తనను సెకండ్ సీజన్ కోసం అడిగారని, నాటి విషయాలను తాజాగా రివీల్ చేసింది శ్రీరెడ్డి.

Sri Reddy ABout Bigg Boss 4 Telugu Show And Contestants Exposing
Sri Reddy ABout Bigg Boss 4 Telugu Show And Contestants Exposing

తనను రెండో సీజన్ కోసం అడిగారట? కానీ ఎక్స్ పోజింగ్ చేసేలా బట్టలు వేసుకుంటావా? మరి అని అడిగారట. దీంతో శ్రీరెడ్డికి మంట పుట్టిందట. బిగ్‌బాస్‌కు పెళ్లాం పిల్లలు ఉండరా? అంటూ ఫైర్ అయిందట. బిగ్‌బాస్ షోలో హద్దులు దాటుతున్న ఎక్స్ పోజింగ్‌పై శ్రీరెడ్డి గళమెత్తింది. ఆంటీలతో కూడా పొట్టి పొట్టి బట్టలేపించి పరువుతీస్తున్నారని, హిందీ, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని బిగ్‌బాస్ షోలపై మండిపడింది.

సినిమాలు వేరు, ఇలాంటి షోలు వేరు ఇంట్లో అందరూ చూస్తారు.. పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి బట్టలు ఎక్స్‌పోజింగ్ చేయకుండా ఉంటే మంచిదని తెలిపింది. ఈ మేరకు బగ్ బాస్ టీం షరుతులు కూడా విధించాలని, ఎక్స్ పోజింగ్ చేయకూడదనే రూల్ పెట్టాలని శ్రీరెడ్డి కోరింది.