ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్ తుపాను సృష్టిస్తోంది. తలపడే జట్లను బంతి పడకముందే ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఒక్కసారి బ్యాటింగ్ మొదలైతే.. వరుసగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురుస్తోంది. 287, 286 పరుగుల భారీ స్కోర్లు చేసిన ఈ జట్టు, నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది. అయినా… SRH దూకుడును ఆపాలంటే స్ట్రాటజీ మారాల్సిందే. దానికి కీలకమైన సమయం మొదటి మూడు ఓవర్లు.
హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ నుంచి మరీ దూకుడుగా ఆడుతున్నారు. ఈ ఇద్దరిని మొదటి నాలుగు ఓవర్లలో కట్టడి చేయలేకపోతే, మ్యాచ్ SRH చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ విధ్వంసాన్ని అడ్డుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. స్టార్క్ వేసిన యార్కర్లు, స్వింగ్‌తో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడిపోయినప్పుడు SRH బ్యాటింగ్ వెనకడుగు వేసింది.
ఇప్పుడు అదే పని లక్నో చేయాలంటే శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్‌లపై ఆశలు పెట్టుకోవాల్సిందే. మొదటి ఓవర్లలో వికెట్లు తీయగలిగితేనే SRH మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హెడ్, అభిషేక్ కలిసి 5 ఓవర్లు ఆడితే టార్గెట్ 220 దాటేలా ఉంటుంది. అలాంటప్పుడు ఇషన్ కిషన్ హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి లాంటి ప్లేయర్లకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ మొదట్లో వికెట్లు పడితే వారికి ఆ ఆటలాగే మిగులుతుంది.
రన్ రేట్‌ని కంట్రోల్ చేయాలంటే పవర్‌ప్లేనే కీలకం. కెప్టెన్ పంత్ ఈ మ్యాచ్‌ను గెలవాలంటే ఈ రెండు వారిని తొలగించడమే మొదటి టార్గెట్‌గా పెట్టుకోవాలి. మొదటి మూడు ఓవర్లలో కనీసం ఒక వికెట్ పడితే SRH ఆటకు బ్రేక్ పడే ఛాన్స్ ఉంటుంది. లేదంటే… పంజాబ్ తో జరిగినట్లు మరో షాక్ ఎదురవ్వడం పక్కా.