నవదీప్‌తో విష్ణుప్రియ డిన్నర్లు.. భాగోతం బయటపెట్టిన శ్రీముఖి

Sreemukhi Reveals Relation Between Vishnu Priya And NavdeepSreemukhi Reveals Relation Between Vishnu Priya And Navdeep

టాలీవుడ్ పులిహోర రాజాల్లో నవదీప్ ముందుంటాడు. అందుకే నవదీప్ లాంటి వారినే అదిరింది వంటి కామెడీ షోకు న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. ఇక ఆ మధ్య మనోడు సన్నీలియోన్‌తో చేసిన రచ్చ మామూలుగా వైరల్ కాలేదు. సన్నీలియోన్‌తో ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో కలిసి నటించడం, సన్నీలియోన్‌తో కలిసి సెల్ఫీలు దిగడం అబ్బో ఆ రోజుల్లో నవదీప్ చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Sreemukhi Reveals Relation Between Vishnu Priya And NavdeepSreemukhi Reveals Relation Between Vishnu Priya And Navdeep
Sreemukhi Reveals Relation Between Vishnu Priya And Navdeep

తాజాగా నవదీప్ కొత్త ట్రాక్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా క్యాష్ షోలో పాల్గొన్న శ్రీముఖి, విష్ణుప్రియలు రచ్చ చేశారు. ఈ షోలో సుమ అడిగిన ఓ ప్రశ్నతో విష్ణుప్రియ వ్యవహారం బయటపడింది. రానా, నవదీప్‌లలో ఎవరితో యాంకరింగ్ చేస్తావని సుమ అడిగింది. అలా అడిగిందో లేదో వెంటనే విష్ణు ప్రియ స్పందిస్తూ.. నవదీప్‌తో చేస్తా నవదీప్ ఐ లవ్యూ అని గట్టిగా అరిచింది. ఇక ఈ టాపిక్‌ను కంటిన్యూ చేస్తూ.. శ్రీముఖి అసలు విషయం బయట పెట్టింది.

Sreemukhi Reveals Relation Between Vishnu Priya And Navdeep
Sreemukhi Reveals Relation Between Vishnu Priya And Navdeep

నవదీప్‌తో విష్ణు ప్రియ బాగా దగ్గరవ్వడం జరిగిందని, నవదీప్ వాళ్లింటికి వెళ్లి డిన్నర్లు అలాగే.. అంటూ శ్రీముఖి చెబుతూ ఉండగానే మధ్యలో విష్ణుప్రియ వచ్చింది. ఏరా అందరికీ చెబుతున్నావేంటి అని ఆపేసింది. సో నవదీప్, విష్ణు ప్రియ మధ్యలో ఏదో ట్రాక్ నడుస్తోందని కన్ఫామ్ అయినట్టే. అదిరిందిలో పంచ్‌లు వేస్తుంటే ఏదో అనుకున్నాం గానీ నవదీప్ మామూలోడు కాదు.