పటాస్ షోతో బుల్లితెరపై సందడి చేసిన శ్రీముఖి తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన పెళ్లి గురించి అసలు విషయం చెప్పింది. తాజాగా ఈమె సుమ క్యాష్ షోలో పాల్గొంది. అందులో ఢీ కంటెస్టెంట్ పండు కూడా అతిథిగా వచ్చాడు. ఈ మధ్యే పలాస సినిమాలో నక్కిలీసు గొలుసు పాటకు దుర్గారావ్ స్టెప్పులు వేసి బాగా వైరల్ అయ్యాడు. ఇక ఆ లేడీ గెటప్ కూడా ఫుల్ ఫేమస్ అయింది.
ఈ విషయాన్ని శ్రీముఖి గుర్తు చేస్తూ అసలు విషయాన్ని బయటకు చెప్పేసింది. పండు ఒక వేళ ఆ లేడీ గెటప్ వేసుకోకుంటే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఒకవేళ అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా.. ఏంటి నీకు ఇష్టమేనా? అంటూ అందరి ముందు అడిగేసింది. ఇక అతను కూడా సరే అనేశాడు.
ఇక మరో సందర్భంలో శ్రీముఖి మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలోంచి వెళ్లిపోతాను అని మరో బాంబ్ పేల్చింది. ఇక పండు మరింత సిగ్గుపడిపోయాడు. మధ్యలో గెటప్ శ్రీను వచ్చి.. పండుకు కౌంటర్ వేశాడు. ఆమె పెళ్లి చేసుకుంటా అంది.. కానీ నిన్ను కాదు..నువ్ తోడు పెళ్లి కొడుకువి అంటూ గాలి తీసేశాడు. అయితే షో కోసం రేటింగ్ కోసం చెప్పినవో ఏమో తెలియదు గానీ.. రెండేళ్లలో నిజంగానే శ్రీముఖి ఓ ఇంటి అమ్మాయి అవుతుందేమో చూడాలి.