వైరల్ : శ్రీలీలలో మరో సూపర్ షేడ్..

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ యంగ్ స్టర్ శ్రీలీల హవా నడుస్తుంది. ఆమె ఇప్పుడు ఏకంగా 10 చిత్రాల మేర చేతిలో పెట్టుకొని బిగ్గెస్ట్ స్టార్ అండ్ బిజీ హీరోయిన్ గా నిలవగా ఈమెకి ఇంత క్రేజ్ రావడానికి ఉన్న కారణాల్లో తన టాలెంట్ అనే చెప్పాలి.

సూపర్ ఫాస్ట్ డాన్స్ తో ఆమె ఇంప్రెస్ చేయడం టాలీవుడ్ లో చర్చగా మారింది. దీనిత్ హీరోయిన్స్ లో ఎనర్జీకి కేరాఫ్ గా మారిన శ్రీలీల ఇపుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారగా ఈమె ఇప్పటివరకు ఒక నటిగా డాన్సర్ గా మాత్రమే కాకుండా తనలోని ఇంకో ఇంట్రెస్టింగ్ షేడ్ ని చూపించడం వైరల్ గా మారింది.

ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం “స్కంద” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగ్గా అందులో శ్రీలీల ఓ సాంగ్ ని పాడి మెస్మరైజ్ చేసింది. అచ్చ తెలుగులో సాంగ్ ని సూపర్ గా దింపేసింది. దీనితో అసలు ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చాలా మంది షాకవుతున్నారు.

దీనితో సింగర్ శ్రీలీల స్పెషల్ సాంగ్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించగా ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.