ఈ విషయంలో మరోసారి హాట్ టాపిక్ గా శ్రీలీల.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు ఓ రేంజ్ లో షైన్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల. ఆమె తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేయగా ఇక నెక్స్ట్ మాస్ మహారాజ రవితేజ “ధమాకా” లో చూపించిన ఎనర్జీతో అయితే టాలీవుడ్ ఒక్కసారిగా స్టన్ అయిపోయింది.

ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇంత ఎనర్జిటిక్ గా ఉంది అని చాలా మంది అనుకున్నారు. ఇక అక్కడ నుంచి శ్రీ లీల అయితే టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్కసారిగా బిజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ తెలుగు హీరోయిన్ టాలీవుడ్ లక్కీ చార్మ్ కూడా కూడా నిలిచింది.

అయితే ఈమె నటిగా కన్నా తన డాన్స్ విషయంలో బాగా వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి తన ఎనర్జటిక్ డాన్స్ తోనే వైరల్ గా మారింది. తనకు నటించిన తాజా చిత్రం “స్కంద” నుంచి చిత్ర యూనిట్ రెండో సాంగ్ ని రిలీజ్ చేయగా అందులో రామ్ పోతినేని కన్నా ఫాస్ట్ గా శ్రీ లీల డాన్స్ చేసేస్తుంది.

దీనితో అసలు ఈ స్పీడ్ ఏంటి రామ్ లాంటి డాన్సర్ నే డామినేట్ చేయడం ఒక్క శ్రీ లీల కె చెల్లింది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకుంటున్నారు. దీనితో ఈ విషయంలో శ్రీలీల మరోసారి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలవడమే కాకుండా మళ్ళీ డాన్స్ పరంగా ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. 
Gandarabai | Lyrical Video (Telugu) | Skanda | Ram Pothineni, Sree Leela | Boyapati Sreenu |Thaman S