గాసిప్స్ – “పుష్ప 2” భారీ ఆఫర్ వద్దన్న శ్రీలీల.?

1124027-sree-leela

ఇప్పుడు మన తెలుగు సినిమా దగ్గర మోస్ట్ బిజీ అండ్ మోస్ట్ డిమాండ్ ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రీసెంట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీలే అని చెప్పాలి. కాగా ఈ యంగ్ హీరోయిన్ నటిస్తున్న చిత్రాలు ఇప్పుడు పదుల సంఖ్యలోకి చేరగా ఇంకా ఈమె డేట్స్ కోసం నిర్మాతలు దర్శకులు వెంపర్లాడుతున్నారు.

దీనితో శ్రీ లీల వరల్డ్ లోనే అధిక చిత్రాలు చేస్తున్న హీరోయిన్ గా నిలవగా లేటెస్ట్ గా అయితే ఓ క్రేజీ గాసిప్ ఈమెపై వినిపిస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ తో చిత్రాల్లో ఒకటైన “పుష్ప 2” నుంచి ఓ భారీ ఆఫర్ వచ్చిందట. అయితే దీనిని శ్రీ లీల తిరస్కరించింది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

కాగా దీనికి కారణం ఏమిటంటే పుష్ప 1 లో ఉన్నట్టుగానే ఓ హాట్ ఐటెం సాంగ్ ఉండగా ఇప్పుడు పార్ట్ 2 లో కూడా ఓ సాలిడ్ సాంగ్ ని సెట్ చేయగా అందులో ఐటెం గర్ల్ గా అయితే శ్రీ లీల ని సంప్రదించారు అంట. పైగా భారీ మొత్తంలోనే ఆఫర్ చేసినప్పటికీ శ్రీ లీల ఈ ఆఫర్ కి నో చెప్పేసింది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

దీనితో ఈ రకంగా శ్రీ లీల ఓ మాసివ్ ఆఫర్ ని వదిలేసింది అని చెప్పాలి. ఇక హీరోయిన్ గా అయితే ఆల్ మోస్ట్ ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న చిన్న పెద్ద అందరి హీరోస్ తోని ఈమె ఇపుడు నటిస్తూ టాలీవుడ్ మోస్ట్ బిజీ హీరోయిన్ గా దూసుకెళ్తుంది.