కన్నడంలో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెలెక్కిన కాంతారా మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. 15 కోట్లతో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ముందు కన్నడంలో రిలీజ్ అయిన ఈ చిత్రం వంద కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. కన్నడనాట కేజీఎఫ్ 2 రికార్డుని సైతం కాంతారా బ్రేక్ చేసింది అంటే ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
తరువాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా కాంతారా మూవీ డబ్ అయ్యి ప్రేక్షకులని అలరించింది. భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా కలెక్ట్ చేయడం విశేషం. ఇప్పుడు కాంతారా 2 సినిమాకి రంగం సిద్ధం అవుతోంది. కాంతారా ప్రీక్వెల్ గా ఈ కథాంశం ఉండబోతోందని ఇప్పటికే రిషబ్ శెట్టి కన్ఫర్మ్ చేశారు.
మొదటి చిత్రం 15 కోట్ల బడ్జెట్ తో చేస్తే ఈ ప్రీక్వెల్ కథాంశంలో హిస్టారికల్ డ్రామా ఉంటుంది కాబట్టి గ్రాండియర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారంట. 100 కోట్ల బడ్జెట్ దాటుతుందని ఇప్పటికే హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందంట. దీని ప్రకారం లెక్కలు వేసుకుంటే 130 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇందులో 30 కోట్లకి పైగా రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారంట. అలాగే స్టార్ క్యాస్టింగ్ ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఉంటారనేది ఇంకా క్లారిటీ లేదు. త్వరలో కాంతారా 2 మూవీకి సంబందించిన పూర్తి వివరాలతో పాటు క్యాస్టింగ్ ని ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంట. అలాగే ఈ ఏడాదిలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారంట.
మరి నేచర్, స్పిరిచువల్ కాన్సెప్ట్ తో వచ్చిన కాంతారా 1 స్థాయిలో ప్రీక్వెల్ స్టోరీ కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలి. సినిమాలో ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్రలో కనిపించనుందని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు.