గడిచిన ఈ నాలుగైదు ఏళ్లలో అయితే ఇండియన్ సినిమా దగ్గర మెయిన్ గా పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది తెలిసిందే. మెయిన్ గా అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర తెలుగు సినిమాలు సహా సౌత్ ఇండియా సినిమాలు హవా క్లియర్ కట్ గా కనిపించింది.
అయితే ఈ క్రమంలో బాలీవుడ్ మార్కెట్ అక్కడి సినిమాలు కూడా దారుణంగా పరాజయం పాలు కావడం సౌత్ సినిమాకి మరింత ప్లస్ కాగా ఇప్పుడు అయితే హిందీ సినిమాలు కాస్త మెరుగు పడ్డాయి. దీనితో మార్కెట్ లో బాలీవుడ్ సినిమాలు సరిగ్గా పెర్ఫామ్ చేయని సమయంలో అయితే సౌత్ ఇండియా సినిమాలకి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లో మంచి డిమాండ్ మరియు ధర పలకగా ఇప్పుడు అయితే నార్త్ డిస్ట్రిబ్యూటర్ లు సౌత్ నిర్మాతలకి షాకిస్తున్నారట.
అలాగే ఇప్పటికే చేసుకున్న డీల్స్ కొన్నిటి నుంచి అయితే వెనక్కి కూడా వచ్చేస్తున్నారట. తమకి ఇక సినిమాలు అక్కరలేదు అని లేదా తక్కువ ధర మాత్రమే ఇస్తామని చెప్తున్నారట. దీనితో ఇప్పుడు నార్త్ మార్కెట్ లో సౌత్ సినిమాల డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అనిపిస్తుంది.
మెయిన్ గా ఇప్పుడు దాదాపు హిందీ సినిమాలు అన్నీ భారీ వసూళ్లు రాబట్టడం ప్రధాన కారణం కాగా దీనితో హిందీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ సినిమాకి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నట్టుగా ఇపుడు రూమర్స్. అయితే కొన్ని భారీ సినిమాలు మినహా మిగతా వాటికి మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉందని సమాచారం.