కొడుకులే అతిథులు…ఘోస్ట్ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేయనున్న తండ్రి కొడుకులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున ఇప్పటికి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల నాగార్జున నటించిన “ది ఘోస్ట్” సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సినిమా యూనిట్ తేదీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 25న ఆదివారం కర్నూలులో STBC గ్రౌండ్‌లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో ఈ ఈవెంట్లో పాల్గొనే ముఖ్య అతిథుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనే ముఖ్య అతిధులు మరెవరో కాదు… అక్కినేని వారసులైన అక్కినేని నాగచైతన్య, అక్కినేని నిఖిల్. ఇలా అక్కినేని హీరోలు ముగ్గురు ఒకే వేదికపై కనిపించనున్నారన్న వార్త తెలియడంతో వారి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుని సినిమా పై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మీద కూడా నాగార్జున చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక గతంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన శివ సినిమా కూడా అక్టోబర్ 5వ తేదీ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు “ది గోస్ట్” సినిమా కూడా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుండటంతో ఈ సినిమా కూడా భారీ విజయం అందుకుంటుందని నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.