ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల బంధంపై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి కుమారుడు

ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల అనుబంధం ఇప్పటికి.. ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎందుకంటే తెలుగువారికి అన్నగారిలా.. ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఎంతోమందికి చేరువయ్యారు. అలాంటి ప్రశాంతమైన జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టడం అడుగడుగున అంతులేని సంచలనాలకు ప్రతీకగా మారింది. ఆమె రాకతో ఎన్టీఆర్ పొలిటికల్ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ అలజడి రేపింది. దానికి తోడు చంద్రబాబు నాయుడుకు పూర్తి విరుద్దంగా.. రాజకీయాల్లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారు లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమెకు ఒక కొడుకు ఉన్నారు. అతని పేరు కోటేశ్వర ప్రసాద్. ప్రస్తుతం ఆర్థోపెడిక్ డాక్టర్ గా సేవలందిస్తున్నారు.

దేశంలోనే అతికొద్ది మంది ఎముకల వైద్య నిపుణుల్లో కోటేశ్వర ప్రసాద్ ఒకరిగా నిలిచారు. 5 సంవత్సరాల వయస్సులోనే భగవద్గీత పారాయణంలో గోల్డ్ మెడల్ సాధించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి.. తన తల్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటేశ్వర ప్రసాద్ చిన్నతనంలో ఎన్టీఆర్ ను అంకుల్ అని పిలిచేవారట. ఎన్టీఆర్ ను కూడా కేవలం ఎనిమిది సార్లు కలిసారని.. ఆయన ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారని ఇంటర్వ్యూలో చెప్పారు.

ఎన్టీఆర్ ను కలిసినప్పుడు చాలా ఆత్మీయంగా మాట్లాడేవారని.. ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవారు. లక్ష్మీ పార్వతి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ చనిపోయారు. ఆ సమయంలోనే తన తల్లి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నార‌ని కోటేశ్వర ప్రసాద్ అన్నారు. అయినవాళ్ళు.. బందువులూ పూర్తిగా మారిపోయారు. అసలు రాజకీయం అంటే ఇదేనేమో అనిపించేలా పరిస్థితులు మారాయి. ఒక అజెండా పెట్టుకుని మనుషుల్ని దూరం చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. ఎన్టీఆర్ గారి ప్రచారానికి తాను ఒకటి రెండుసార్లు వెళ్లానని.. తమ మధ్య మంచి రిలేషన్ ఉండేదని చెప్పుకొచ్చారు లక్ష్మీ పార్వతి కొడుకు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్.