అసూయతోనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఈయన పేరు ప్రఖ్యాతలు పొందారు. అనిల్ రావిపూడి వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను కూడా అందిస్తున్నారు. తాజాగా ఈయన ఎఫ్3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి విజయం కావడంతో తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో అనిల్ రావిపూడి ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఇండస్ట్రీలో తన గురించి కావాలని కొందరు తప్పుడు వార్తలను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారనీ షాకింగ్ కామెంట్స్ చేశారు.తను సినిమాలు చేయడం వల్ల నిర్మాతలకు బయ్యర్లకు భారీగా నష్టాలు వచ్చాయి అంటూ కొందరు తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు.

ఇప్పటివరకు తన సినిమాలను కొనుగోలు చేసిన బయ్యర్లు కానీ నిర్మాతలు కానీ ఎవరు నష్టపోలేదని కేవలం ఇవన్నీ నన్ను టార్గెట్ చేస్తూ సృష్టిస్తున్న వార్తలు అంటూ ఈయన వెల్లడించారు. ఇండస్ట్రీలో నేను హిట్ సినిమాలు చేయడంతో ఆ విజయాన్ని చూసి కొందరు జెలసీగా ఫీల్ అవుతూ ఇలాంటి వార్తలను సృష్టించారని ఈ సందర్భంగా అనిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో ఈయనని ఇండస్ట్రీలో టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.