సలార్ నుంచి సాలీడ్ అప్‌డేట్ .. రేపే గ్రాండ్ ఓపెనింగ్ ..!

సలార్ నుంచి సాలీడ్ అప్‌డేట్ వచ్చేసింది. రీసెంట్ గా ప్రభాస్ నటించబోతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఈ నెల 19 నుంచి మొదలవబోతుందన్న న్యూస్ తెలిసినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ సినిమా విషయంలో ఆతృత పెరిగింది. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ ల సలార్ ఎప్పుడు షూటింగ్ మొదలబోతుంది అని. గత నెలలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 షూటింగ్ కంప్లీట్ చేయడం తో నెక్స్ట్ సలార్ ని సెట్స్ మీదకి తీసుకు వస్తాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు జనవరి మొదటి వారం నుంచే సలార్ సెట్స్ మీదకి రాబోతుందన్న వార్తలు వచ్చాయి.

Prabhas upcoming films| From Salaar to Adipurush - here's a look at all the  upcoming films of Prabhas

కాని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం తో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ ఆయ్యారు. ఆ డిసప్పాయింట్ ని పోగొట్టేశారు సలార్ మేకర్స్. తాజాగా ఈ సినిమా ప్రారంభం ఎప్పుడు కాబోతుందో సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ నిర్మిస్తున్న సలార్ జ‌న‌వ‌రి 15న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనని కాసేపటి క్రితం మేకర్స్ వెల్లడించారు.

KGF' vs Shah Rukh Khan's Zero: Yash says both films are unique | Hindi  Movie News - Times of India

 

కేజీఎఫ్ చాప్టర్ 1 అండ్ 2 సినిమాలతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ ని డాన్ గా చూపించబోతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందనున్న సలార్ కేవలం 4 నెలల్లో పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఇక ప్రభాస్ నుంచి రాధే శ్యాం తర్వాత వచ్చే సినిమా కూడా సలార్ కావడం విశేషం. ఇక జనవరి 15 న ప్రారంభం కాబోతున్న సలార్ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు.