టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న తాజా చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తన కామెడీ జానర్ ని పక్కన పెట్టి ఫుల్ మాస్ ఇమేజ్ తో చేస్తున్న సినిమా ఇది కాగా దీనిపై భారీ హైప్ ఇప్పుడు నెలకొంది.
అయితే ఇందులో బాలయ్య డ్యూయల్ షేడ్స్ లో కనిపిస్తుండగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి గత కొన్ని రోజులు గా ఊరిస్తున్న మ్యూజికల్ ట్రీట్ ని ఇప్పుడు అనౌన్స్ చేసేసారు. మరి సెప్టెంబర్ లో ఉన్న వినాయక చవితికి సరిపడేలా గణేష్ అంతెం అంటూ ఫస్ట్ సాంగ్ ని ఇప్పుడు అనౌన్స్ చేశారు.
కాగా రేపు ఆగస్ట్ 30న సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేస్తుండగా నెక్స్ట్ అయితే ఈ ఫుల్ సాంగ్ ని ఈ సెప్టెంబర్ 1 న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సాంగ్ బాలయ్య యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇద్దరిపై సాంగ్ ని డిజైన్ చేసినట్టుగా పోస్టర్ తో తెలిపారు.
మరి ఇద్దరూ డాన్స్ విషయంలో ఎక్కడా తగ్గరు అలాంటిది ఇద్దరి మధ్య డాన్స్ వార్ అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇంకా ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ అక్టోబర్ 19న సినిమా విడుదల కాబోతుంది.
The electrifying presence of #NandamuriBalakrishna and elegance of @sreeleela14 is going to be LIT in #GaneshAnthem 🔥
Song Promo Tomorrow at 4:05 PM❤️🔥
Full Lyrical on Sep 1st 💥#BhagavanthKesari
A @MusicThaman Musical 🥁@AnilRavipudi @MsKajalAggarwal @rampalarjun… pic.twitter.com/tLKFiuam1r— Shine Screens (@Shine_Screens) August 29, 2023