Bigg boss 4: అభిజీత్ ను కిందికి నెట్టేసి.. టాప్ లోకి వచ్చేసిన సోహెల్.. క్రేజ్ మామూలుగా లేదు?

sohel ryan craze increased in bigg boss

ఎస్… నిన్నమొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ టాప్ లో ఉండేవాడు. మైండ్ గేమ్ ఆడుతడు.. కరెక్ట్ గా మాట్లాడుతడు.. అంటూ ఏదేదో క్లారిఫికేషన్స్ ఇస్తూ అభిజీత్ ను టాప్ లో నిలిపారు. ప్రేక్షకులు కూడా నామినేట్ అయిన ప్రతి సారీ అభిజీత్ ను సేవ్ చేస్తూ వచ్చారు. నో డౌట్ గత వారం కూడా అభిజీత్ సేవ్ అయ్యాడు కానీ.. ఎప్పుడు.. చివర్లో అభిజీత్ సేవ్ అయ్యాడు.

sohel ryan craze increased in bigg boss
sohel ryan craze increased in bigg boss

గత వారం కన్నా మిగితా వారాలు పోల్చుకుంటే.. ఎప్పుడైనా అభిజీత్ ఫస్ట్ టైమ్ సేవ్ అయ్యేవాడు. కానీ.. ఈ సారి ఫస్ట్ టైమ్ సోహెల్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత హారిక, మోనల్ సేవ్ అయ్యారు. మోనల్ తర్వాత అభిజీత్ సేవ్ అయ్యాడు. అంటే హారిక, మోనల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఇప్పుడు అభిజీత్ కు లేదా? ఒక్కప్పుడు టాప్ కంటెస్టెంట్ గా ఉన్న అభిజీత్ ఫాల్ డౌన్ ఎందుకు అయ్యాడు? అనేదాని గురించి చర్చించే కన్నా.. ఆయన్ను మించి టాప్ లోకి వచ్చిన సోహెల్ గురించి మాట్లాడుకుందాం.

అరె.. నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది బయ్. సేమ్.. అచ్చం నాలాగే ఉన్నావు. నాలాగే చేస్తున్నావు. అయినా మనిషన్నాక కాసింత కోపం ఉండాలి. చాలా సహజంగా ఉన్నావు. ఇదే మాకు నీలో నచ్చింది అంటూ ప్రేక్షకులు కూడా సోహెల్ కు పట్టం కడుతున్నారు.

సోహెల్.. హౌస్ లో ప్రవర్తించే తీరుకు ఫిదా అయిపోతున్నారు జనాలు. అందుకే గత వారం సోహెల్ ను మొదటిసారి సేవ్ చేసి ప్రస్తుతం టాప్ పొజిషన్ లోకి తీసుకొచ్చారు. అంతే కాదు.. సోహెల్ ఇలాగే ఉంటే.. బిగ్ బాస్ టైటిల్ కూడా గెలుచుకునే చాన్స్ ఉంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.