ప్రతీ ఒక్క విషయం చెప్పారు.. బ్రహ్మానందంపై సోహెల్ కామెంట్స్

Sohel about Conversation with Brahmanandam

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక సోహెల్‌కు తన ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అలా మూడో స్థానంలో 25 లక్షలు తీసుకుని బయటకు రావడమే ఒక హిస్టరీ. అలా డబ్బులతో బయటకు వచ్చిన సోహెల్ విజేత అభిజిత్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అభిజిత్ కంటే ఎక్కువగా కూడా ఆ రోజు సోహెల్ వైరల్ అయ్యాడు. అదే సోహెల్ గెలుపు అంటూ ఆయన అభిమానులు చెప్పుకొంటున్నారు.

పైగా స్టేజ్ మీదే సోహెల్ గురించి చిరు చెప్పిన మాటలు, ఇచ్చిన వరాలు, ప్రేమగా తెచ్చిన వంటకాలు అతడి క్రేజ్‌కు నిదర్శనమని అంటున్నారు. పైగా బ్రహ్మానందం కూడా సోహెల్‌కు ఫోన్ చేసి మరీ మాట్లాడట. స్టార్ మాలో రఘు అనే అతని వ్యక్తి ద్వారా తనకు బ్రహ్మానందం ఫోన్ చేశాడని సోహెల్ చెప్పుకొచ్చాడు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ సోహెల్ ఎమోషనల్ అయ్యాడు.

Sohel about Conversation with Brahmanandam
Sohel about Conversation with Brahmanandam

బ్రహ్మానందం గారు ప్రతీ ఎపిసోడ్ చూసేవారు.. నేను చేసింది ప్రతీ ఒక్కటి చెప్పారు. ఒకసారి అరియానా మీద కోపం, ఆమె ఇచ్చిన పనిష్మెంట్ చేయడం లేదని పరిగెత్తుకుంటూ వచ్చి స్విమ్మింగ్ పూల్‌లో దూకిన సీన్ గురించి చెప్పారు. ఎవరినైనా కొడతానా? దేన్నైనా పగలగొడతానా? అని ఎంతో ఆత్రుతగా చూస్తే నువ్వు వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో దూకావయ్యా అని బ్రహ్మానందం మాట్లాడారంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు.