Sobhita: అచ్చ తెలుగు అమ్మాయిగా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శోభిత ధూళిపాళ్ల ఒకరు. ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు అనంతరం తెలుగు తెరపై ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శోభిత నటుడు నాగచైతన్య ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను రెండో వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సినిమా సెలబ్రిటీల సమక్షంలో జరిగింది. ఇక పెళ్లి తర్వాత శోభిత సినిమాలలో నటిస్తుందా లేదా అనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ఇక పెళ్లి తర్వాత కూడా శోభిత సినిమాలలో నటించడానికి అక్కినేని కుటుంబం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె పెళ్లయిన నెలకే కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈమె బాలీవుడ్ సినిమాలకు కాకుండా తెలుగు సినిమాకు కమిట్ అయ్యారనే విషయం తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈమె టాలీవుడ్ టైర్ 2 హీరో సినిమాకి కమిట్ అయ్యారని తెలుస్తోంది.
ఒకప్పుడు అంటే ఏదో ఒక సినిమాలో నటించేసేది . కానీ ఇప్పుడు మాత్రం అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది . అయినా సరే.. ఓ టైర్ 2 హీరో సినిమాతో నటించడానికి ఓకే చేసిందంటే మాత్రం ఆ స్టోరీర్లో ఏదో ఒక్క బిగ్ ట్వీస్ట్ ఉండనే ఉంటుందని అందుకే శోభిత ఇలా టైర్ 2 హీరో సినిమాలకు కూడా ఓకే చెబుతున్నారని తెలుస్తోంది. మరి ఈమె ఏ హీరో సినిమాకు కమిట్ అయింది అసలు డైరెక్టర్ ఎవరు కథనం ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.