షాకింగ్ : లాస్ట్ మినిట్ లో రిలీజ్ ఆగిపోయిన తమిళ హీరో సినిమా.!

ఈ మధ్య కాలంలో అయితే పలు చిత్రాలు మొదట అంతా కరెక్ట్ గానే ఉన్నప్పటికీ సరిగ్గా రిలీజ్ రోజునే ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మరి అలా లేటెస్ట్ గా తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ సినిమాకి కూడా ఇలాగె జరిగింది. అయితే చాలా వరకు కాంట్రవర్సీ లకి దూరంగా ఉండే ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమానే “మావీరన్”.

అయితే ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం “మండేలా” దర్శకుడు అశ్విన్ మడోనే తెరకెక్కించగా ఈ సినిమా తెలుగులో కూడా “మహావీరుడు” టైటిల్ పేరిట అయితే ఈరోజు జులై 14 రిలీజ్ కి వచ్చింది. కాగా ఈ సినిమా అయితే ఇపుడు ఉహించని విధంగా లాస్ట్ మినిట్ లో రిలీజ్ ఆగిపోయింది.

కాగా తమిళనాడులో ఏమో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా మార్నింగ్ షో లు ఎక్కడా పడలేదు. అయితే దీనికి కారణం ఈ చిత్రం కంటెంట్ లేట్ గా వెళ్లడమో లేదా అసలు వెళ్లకపోవడమే అన్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ యంగ్ హీరో సినిమాకి లాస్ట్ మినిట్ లో ఊహించని షాక్ తగిలింది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

అయితే ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ లో కూడా ఇదే పరిస్థితి అన్నట్టుగా కూడా సమాచారం. మరి ఇది ఎప్పటికి సార్ట్ అవుట్ చేస్తారో చూడాలి. కాగా ఈ చిత్రంలో అయితే పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించగా మన టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ తెలుగు వెర్షన్ కి వాయిస్ ఓవర్ అందించారు.