రీ రిలీజ్ కు సిద్ధమైన శివ.. అభిమానులకు పండగే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే మహేష్ బాబు నటించిన పోకిరి పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలు విడుదలయ్యాయి. ఇలా పలువురు హీరోల సినిమాలు తిరిగి విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతో సందడి చేశాయి. ఇకపోతే తాజాగా నాగార్జున వంతు వచ్చింది. నాగార్జున నటించిన శివ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే శివ సినిమాని తిరిగి విడుదల చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఈ సినిమా 1990 డిసెంబర్ 7వ తేదీవిడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని తిరిగే డిసెంబర్లో విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాని థియేటర్లో కాకుండా విభిన్నంగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇలా శివ సినిమాని తిరిగి విడుదల చేయనున్న విషయాన్ని నాగార్జున తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక తెలుగులో విడుదలైన ఈ సినిమాని తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.