Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్ గామాత్రమే కాకుండా అతి చిన్న వయసులోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న సితార అందరికీ సుపరిచితమే.తొమ్మిది సంవత్సరాల వయసులోనే సితార ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ మల్టీ టాలెంటెడ్ కిడ్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక తన తండ్రి నుంచి నటన వారసత్వంగా అందిపుచ్చుకున్న ఈమె కూడా మెల్లిగా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే ఒక ఇంగ్లీష్ సినిమాకు డబ్బింగ్ చెప్పిన సితార తన తండ్రి నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రంలో పెన్నీ సాంగ్ ద్వారా సందడి చేయనున్నారు.ఇలా చిన్న వయసులోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సితార గురించి తన తల్లి నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సితార సంతోషంగా ఉండటం కోసం తాను ఏం చేయాలన్నా అది చేయడానికి మేము ప్రోత్సహిస్తామని నమ్రత తెలిపారు. అయితే తన వయసు ఇంకా తొమ్మిది సంవత్సరాలు కనుక తనకు ప్రతి ఒక్క విషయంలోనూ నేను, మహేష్ దిశానిర్దేశం చేస్తాము.
తను ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా తనకు గైడెన్స్ ఇస్తాము. ఇంత చిన్న వయసులో పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల గైడెన్స్ ఎంతో ముఖ్యమని, అది సితారకు బోలెడు ఉందంటూ నమ్రత చెప్పుకొచ్చారు. అయితే సితార ఎప్పుడు ఏది చేయాలి ఎక్కడ ఎలా ఉండాలి అనే విషయాల గురించి మేము తనకు సూచనలు చేసుకుంటామని తను కూడా తన లిమిట్స్ లో ఉంటూ తనకు నచ్చిన పని చేస్తుందని, ఎప్పుడు తన లిమిట్స్ క్రాస్ చేయదని నమ్రత తన కూతురు సితార గురించి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం నమ్రత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.