ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24వ తేదీ న్యూమోనియా బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురి కావడం చేత ఆయనను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడక పోవడంతో చివరికి ఆయన చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సీతారామశాస్త్రి సిరివెన్నెల చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈయన సుమారు మూడు వేలకు పైగా పాటలను రాసి విశేష ఆదరణ దక్కించుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఈయన కృషిని గుర్తించి 2019 సంవత్సరంలో ఇతనికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు.
అంతేకాకుండా ఈయనకు 11 రాష్ట్ర నంది అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. అయితే ఉన్నఫలంగా ఇతనికి అనారోగ్యం చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆయన పరిస్థితి విషమించడంచేత నేడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. తాజా ఈయన మరణవార్త వినగానే పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గత ఆదివారం ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతి చెందారన్న వార్త నుంచి బయటపడక ముందే ఇలా సిరివెన్నెల మరణవార్త తెలియడంతో పలువురు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.