Big Boss Siri: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన సిరి .. అప్పటి ముచ్చట్లను గుర్తు చేసుకున్న సిరి!

Big Boss Siri: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అంటేనే సిరి షణ్ముఖ్ జస్వంత్ జంట గుర్తుకు వస్తారు.యూట్యూబ్ వీడియోలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ మాములుగా లేదు. వీరిద్దరితో పాటు జస్వంత్ కలిసి ముగ్గురు ఎల్లప్పుడూ మోజ్ రూమ్ కి పరిమితం అయి, ఇతర కంటెస్టెంట్ ల గురించి కామెంట్ చేస్తూ ఉండేవారు. ఇక జశ్వంత్ ఎలిమినేట్ అయిన తర్వాత సిరి షణ్ముఖ్ ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోయారు. ఎప్పుడు చూడు మోజ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఉంటూ నిత్యం కిస్సులు, హగ్గులతో ఈ జంట చేసిన హంగామా అందరికీ తెలిసిందే.

ఇలా వీరి వ్యవహార శైలి వల్ల టైటిల్ గెలవాల్సిన షణ్ముఖ్ జస్వంత్ చివరికి రన్నర్ గా మిగిలిపోయారు. అలాగే షణ్ముఖ్ జస్వంత్ తో దీప్తి సునైనా బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఇలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సిరి చేసిన హంగామా మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమెనూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఇలా బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి వెళ్ళిన సిరి అక్కడ కంటెస్టెంట్ లతో వారి బిగ్ బాస్ విశేషాలు అన్నింటిని పంచుకున్నారు.

ఈ క్రమంలోనే సిరి మోజ్ రూమ్ కి వెళ్లి తాను షణ్ముఖ్ జస్వంత్, జెస్సీ నిత్యం ఇక్కడే కూర్చొని మాటలు పెట్టుకునే వాళ్ళం అంటూ తెలియచేశారు. అలాగే బెడ్ రూమ్ కి వెళ్లి ఈ బెడ్ పైన నేను, షన్నూ ఉండేవాళ్లమని ఈ బెడ్ మేమిద్దరం షేర్ చేసుకునే వాళ్ళమని సిరి అప్పటి ముచ్చట్లను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సిరి అప్పటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఉండగా నటరాజ్ మాస్టర్ ఎంటర్ అవుతూ బెడ్ పై మరొకరు కూడా ఉండేవారు అంటూ జెస్సీ గురించి తెలియజేశారు.